Jayashankar Bhupalpally District: పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామాలు

  • జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో ఘటన
  • ఓటు వేయడానికి నిరాకరించిన మూడు శివారు గ్రామాల ప్రజలు
  • ఆవాస గ్రామాలను పంచాయతీలు చేయాలని డిమాండ్‌

తెలంగాణ తొలివిడత పంచాయతీ ఎన్నికలను మూడు శివారు గ్రామాల ప్రజలు తిరస్కరించారు. ఆవాస గ్రామాలను పంచాయతీలుగా చేయాలన్న తమ డిమాండ్‌ను సర్కారు పట్టించుకోకపోవడంతో ఇందుకు నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం పంచాయతీలోని ఎక్కల, బూటారం, చింతలపాడు గ్రామాల ప్రజలు  ఓటు వేసేందుకు నిరాకరించారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరినప్పటికీ వారు పట్టించుకోలేదు. కాగా, ఇదే జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపాలెం పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంతో రెండు వర్గాల మధ్య తోపులాటలు జరిగి ఒక మహిళ గాయపడింది. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది.

More Telugu News