Andhra Pradesh: జగన్ పద్ధతులు, విధానాలు నచ్చకే వంగవీటి రాధా బయటకువచ్చారు!: మంత్రి ప్రత్తిపాటి

  • జగన్ తీరు నచ్చని వాళ్లు వైసీపీలో ఇంకా  ఉన్నారు
  • ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుకు మోదీ యత్నం
  • ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి భయం పట్టుకుంది 
వైసీపీ అధినేత జగన్ విధానాలు, పద్ధతులు నచ్చకే వంగవీటి రాధాకృష్ణ బయటకు వచ్చారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ విధానాలు నచ్చక చాలా మంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ తీరు ఇలాగే కొనసాగితే 2019లో ఆ పార్టీ అడ్రస్ కూడా లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఏపీ అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్లెవ్వరూ వైసీపీలో ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కోల్ కతాలో విపక్షాల ర్యాలీ చూశాక ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని మంత్రి దుయ్యబట్టారు.

చిలకలూరిపేటలో 8వ వార్డు విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కోతలు లేకుండా విద్యుత్ ను అందిస్తున్న ఘనత టీడీపీదేనని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని 45 రోజుల్లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
vangaveeti
radha
prattipati
pullarao

More Telugu News