Chandrababu: మేడా మల్లికార్జున రెడ్డికి చెక్.. ‘రెడ్ బస్’ చరణ్ రాజును తెరపైకి తెచ్చిన మంత్రి ఆదినారాయణ రెడ్డి!

  • సీఎం రమేశ్ ను కలుసుకున్న చరణ్ రాజు
  • రాజంపేటలో టీడీపీ తరఫున పోటీకి ఛాన్స్
  • రేపు చంద్రబాబును కలుసుకోనున్న మేడా

కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా తయారైన సంగతి తెలిసిందే. మేడా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని మంత్రి ఆరోపిస్తుండగా, ఆదినారాయణ రెడ్డి తనను అవమానిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మేడా మల్లికార్జున రెడ్డికి రాజంపేటలో చెక్ పెట్టేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఇందులో భాగంగా మేడాకు బదులుగా ‘రెడ్ బస్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్ రాజు పేరును తెరపైకి తీసుకొచ్చారు.

రాజంపేటలో చరణ్ రాజును బరిలోకి దించాలని టీడీపీ అధినేతను కడప జిల్లా నేతలు కోరనున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ రాజు, ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు కడపలోని పొట్లదుర్తిలో టీడీపీ నేత సీఎం రమేశ్ ను కలుసుకున్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలకు సీఎం చంద్రబాబును రేపు కలుసుకుని వివరణ ఇస్తానని మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మేడాతో పాటు మిగిలిన జిల్లా టీడీపీ నేతలు కూడా చంద్రబాబుతో రేపు సమావేశం అవుతారు.

  • Loading...

More Telugu News