Hyderabad: హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్... 121 పాయింట్లతో పట్టుబడిన మహిళా న్యాయవాది!

  • బంజారాహిల్స్ డైమండ్ హౌస్ వద్ద తనిఖీలు
  • పబ్ లో మందుకొట్టి ఆడీ కారులో వచ్చిన మహిళ
  • కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
పూటుగా మందుకొట్టిన ఓ మహిళా న్యాయవాది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్ లో జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన ఆమె, ఓ పబ్ కు వెళ్లి మద్యం తాగి, తన ఆడి కారులో బయలుదేరారు. డైమండ్ హౌస్ వద్ద వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు ఆమె కారును ఆపగా, తొలుత తనిఖీలకు ఆమె నిరాకరించారు.

అయితే, లేడీ పోలీసుల సాయంతో బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 121 వచ్చింది. దీంతో ఆమె కారును పోలీసులు సీజ్ చేశారు. ఇదే సమయంలో టోలీచౌకీ ప్రాంతానికి చెందిన ఉష అనే యువతి సైతం మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చి పట్టుబడింది. ఆమె బీఏసీ 63 పాయింట్లు వచ్చింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 104 మంది పట్టుబడ్డారని, వీరికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
Hyderabad
Banjarahills
Drunk Driving
Lady Lawyer

More Telugu News