Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆటోలు, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత

  • లక్షలాదిమందికి ఊరట కల్పించే నిర్ణయం
  • ‘రైతు రక్ష’పైనా నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం
  • నేడే జీవో జారీ చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని లక్షలాదిమంది ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కల్పించేలా ఈ రెండింటిపై లైఫ్ ట్యాక్స్ ఎత్తివేయాలని నిర్ణయించింది. నేడు నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అనంతరం ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మందికి ఊరట లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

ఇటీవల వరుసపెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, రైతులు, కౌలు రైతులకు మేలు జరిగేలా మరో పథకాన్ని కూడా ఈ ఖరీఫ్ నుంచి అమలు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. దీనికి ‘రైతు రక్ష’ అనే పేరును కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Andhra Pradesh
Autos
Tractors
life tax
Chandrababu

More Telugu News