kumbh mela: కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. లక్ష కోట్లకు పైగా ఆదాయం

  • రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుందని సీఐఐ అంచనా
  • 6 లక్షల మందికి పైగా ఉపాధి
  • పలు దేశాల నుంచి వస్తున్న విదేశీ టూరిస్టులు

జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ మహా వేడుక ద్వారా ఉత్తరప్రదేశ్ కు రూ. 1.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) అంచనా వేసింది. ఇది పూర్తిగా మతపరమైన వేడుక అయినప్పటికీ... మతంతో సంబంధం లేకుండా వివిధ రంగాల్లోని ఆరు లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తోందని తెలిపింది. ఆతిథ్య రంగంలో రెండున్నర లక్షల మందికి, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలో 85 వేల మందికి, ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్స్ లో లక్షన్నర మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించింది.  

వీటితో పాటు ట్యాక్సీ డ్రైవర్లు, టూర్ గైడ్స్, వాలంటీర్లు తదితర మరో 55 వేల మందికి ఉపాధి లభించిందని సీఐఐ తెలిపింది. ఈ భారీ ఆదాయం ద్వారా ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా లబ్ధి పొందనున్నాయని చెప్పింది. మరోవైపు, కుంభమేళాకు సింగపూర్, న్యూజిలాండ్, మారిషస్, మలేషియా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వేల నుంచి కూడా విదేశీ టూరిస్టులు విచ్చేస్తున్నారు. 

More Telugu News