chinarajappa: రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో తెలిపిన చినరాజప్ప

  • పెద్దాపురం నుంచి స్థానికేతరుడిగా పోటీ చేసిన చినరాజప్ప
  • ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపిన హోంమంత్రి
  • ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్న చినరాజప్ప

ఏపీలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అధికార, విపక్షాలు ఎన్నికల కార్యాచరణను రచించే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీల్లో ఎవరికి టికెట్లు దక్కుతాయో? ఎవరికి దక్కవో? అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు, ఏపీ హోంమంత్రి చినరాజప్ప స్థానికేతరుడైనప్పటికీ గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో, ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే మీడియా ప్రశ్నకు సమాధానంగా... ఈసారి కూడా పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పెద్దాపురం నియోజకర్గాన్ని రూ. 1000 కోట్లతో అభివృద్ది చేశానని... నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని చినరాజప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నానని చెప్పారు. పెద్దాపురం నుంచి తాను పోటీ చేయబోవడం లేదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని... ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. అనునిత్యం ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. 

More Telugu News