kct: అసెంబ్లీలో గండ్రకు కౌంటర్ ఇచ్చిన కేసీఆర్

  • ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ చదువుతారు
  • ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇతర అంశాలను కూడా అమలు చేస్తాం
  • ఓడిపోయినా కాంగ్రెస్ మైండ్ సెట్ మారడం లేదు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగుతున్నాయి. గవర్నర్ తన ప్రసంగంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను చదివారంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ చదువుతారని ఆయన అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ మేనిఫెస్టోనే అక్కడి గవర్నర్లు చదువుతారని... తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మేనిఫెస్టోనే ఇక్కడి గవర్నర్ చదువుతారని చెప్పారు.

ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలనే కాకుండా, మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా తాము అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. గత ప్రభుత్వంలో మేనిఫెస్టోలో లేని 72 పథకాలను తాము అమలు చేశామని తెలిపారు. ఎన్నికల్లో దారుణ పరాభవం పొందిన తర్వాత కూడా కాంగ్రెస్ మైండ్ సెట్ మారడం లేదని విమర్శించారు. రైతు రుణమాఫీపై విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు.

More Telugu News