Amit Shah: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. ఇంటికి చేరుకున్న అమిత్‌షా

  • స్వైన్‌ఫ్లూ బారిన పడడంతో ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ చీఫ్‌
  • మీ అభిమానంతో కోలుకుంటానని గతంలో ట్వీట్‌
  • అనారోగ్యం కారణంగా కడప సమ్మేళనానికీ రాని షా
స్వైన్‌ఫ్లూ బారినపడి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ప్రతినిధి అనిల్‌ బలుని తెలిపారు. మీ అందరి ఆదరాభిమానాలతో త్వరలోనే కోలుకుంటానని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆసుపత్రిలో ఉండగా షా అభిమానుల కోసం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అనారోగ్యం వల్ల ఇటీవల కడపలో జరిగిన పార్టీ సమ్మేళన్‌లో కూడా షా పాల్గొనలేకపోయారు. ఆయన బదులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చి వెళ్లారు.
Amit Shah
AIMS
discharged

More Telugu News