Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మారియా షరపోవాకు షాక్!

  • మూడేళ్ల క్రితం వరకూ క్రికెట్ ఆడిన ఆష్లింగ్ బార్టీ
  • ఆపై టెన్నిస్ కు వచ్చి తొలిసారిగా సంచలన విజయం
  • 6-4, 6-1, 6-4 తేడాతో షరపోవా ఓటమి
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ లో ప్రపంచ టాప్ ప్లేయర్లలో ఒకరైన మారియా షరపోవాకు షాక్ తగిలింది. గ్రాండ్ స్లామ్ పోటీల్లో అంతగా పేరు వినిపించని ఆష్లింగ్ బార్టీ చేతిలో ఆమె ఓడిపోయింది. ఈ ఉదయం రాడ్ లోవర్ ఎరీనాలో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ పోరులో షరపోవాను 6-4, 6-1, 6-4 తేడాతో బార్టీ ఓడించింది. ఈ విజయంతో ఆమె ఓ గ్రాండ్ స్లామ్ పోటీలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్స్ కు చేరినట్లయింది. కాగా, బార్టీ మూడేళ్ల క్రితం వరకూ క్రికెట్ క్రీడాకారిణి కావడం గమనార్హం. ఆపై ఆమె టెన్నిస్ ను ఎంచుకుంది.
Australian Open
Maria Sharapova
Ashling Barty
Tennis

More Telugu News