Malaika Arora: నెటిజన్ల దెబ్బకు ఇన్‌స్టాగ్రాం పోస్టునే మార్చేసిన బాలీవుడ్ నటి!

  • సోషల్ మీడియాలో ‘10 ఇయర్ ఛాలెంజ్’ ట్రెండ్ 
  • పదేళ్లంటూ ఇరవై ఏళ్లనాటి ఫోటోను షేర్ చేస్తావా? అంటూ విమర్శలు 
  • ‘20 ఇయర్ ఛాలెంజ్’గా మార్చేసిన మలైకా  
నెటిజన్ల దెబ్బకు ప్రముఖ నటి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌నే మార్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘10 ఇయర్ ఛాలెంజ్’ పేరుతో ఓ ఛాలెంజ్ బాగా వైరల్ అవుతోంది. దీనిలో భాగంగా ప్రముఖులు సామాన్యులన్న భేదం లేకుండా.. తమ 10 ఏళ్ల నాటి ఫోటోలు.. ప్రస్తుత ఫోటోలు పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ నటి మలైకా ఆరోరా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో 1998లో రిలీజ్ అయిన ‘దిల్‌సె’ సినిమాలోని ‘ఛయ్య ఛయ్య’ అనే ప్రత్యేక గీతంలోని తన స్టిల్స్‌ను తాజా స్టిల్స్‌తో జత చేసి పోస్ట్ చేసింది.

ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అయింది. కానీ మలైకా మాత్రం ‘‘నా టెన్ ‘ఇయర్ ఛాలెంజ్’.. గత పదేళ్లు అద్భుతంగా ముగిశాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఎదురు చూస్తున్నా’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై నెటిజన్లు మండిపడ్డారు. ‘1998 నుంచి 2018 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కూడా తెలియదా?’ అని ఒకరు ప్రశ్నిస్తే.. ‘పదేళ్లంటూ ఇరవై ఏళ్ల ఫోటోను షేర్ చేస్తావా?’ అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకరైతే ఏకంగా అందం ఉందే కానీ తెలివి లేదంటూ కామెంట్ చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో మల్లిక తన ‘10 ఇయర్ ఛాలెంజ్‌’ను ‘20 ఇయర్ ఛాలెంజ్’గా మార్చింది.
Malaika Arora
Sharukh Khan
Social Media
Dil se movie
10 Year Challenge

More Telugu News