Lakshmi`s NTr: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర పోషించినదెవరో చెప్పిన వర్మ!

  • పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడు
  • ఎన్టీఆర్ లా కనిపించడంపై ఆయనకు శిక్షణ ఇచ్చా
  • నిన్న విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తొలి టీజర్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తొలి టీజర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ ద్వారా ఎన్టీఆర్ పాత్రదారుడిని వర్మ పరిచయం చేశారు. అయితే, ఎన్టీఆర్ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ ఎవరన్న విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. దీంతో, ఈ పాత్రలో నటించింది ఫలానా ఆర్టిస్ట్ అంటూ పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఊహాగానాలను ఖండిస్తూ ఆ పాత్ర పోషించింది ఎవరన్న విషయాన్ని వర్మ స్పష్టం చేశారు. ఆ వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడని చెప్పారు. ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు పలికించడం వంటి విషయాల్లో ఆయనకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని తన ట్వీట్ లో పేర్కొన్నారు.  

Contrary to some reports the person who is playing NTR In #LakshmisNTR is a telugu theatre actor from West Godavari who I put under training for months to catch NTR’s body language , demeanour , speech pattern etc https://t.co/TX6APEvZ1o

— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2019
Lakshmi`s NTr
varma
director
NTR
nandamuri

More Telugu News