kolkata: కోల్ కతాలో బీజేపీయేతర పక్షాల ఐక్యతా ర్యాలీ.. బెంగాలీలో ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు!

  • స్వాతంత్ర్య సంగ్రామానికి బెంగాల్ దశాదిశ చూపింది
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నదే లక్ష్యం
  • రైతులను దారుణంగా మోసం చేస్తోంది

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వం కోల్ కతాలో బీజేపీయేతర పక్షాల ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పలు పార్టీల నాయకులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు సమరశంఖం పూరించాయి. ఈ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాలీ భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఈరోజు చారిత్రాత్మకమైన రోజని, విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేసిన మమతా బెనర్జీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

అనంతరం, ఆంగ్లంలో చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. స్వాతంత్ర్య సంగ్రామానికి పశ్చిమబెంగాల్ దశాదిశ చూపిందని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రైతులను దారుణంగా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల కష్టనష్టాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తదుపరి సమావేశం అమరావతిలో నిర్వహించాలని చంద్రబాబు కోరగా, అందుకు, మమతా బెనర్జీ అంగీకరించారు.

More Telugu News