priyanka chopra: ‘ప్రియాంక-నిక్ జోన్స్’పై సోషల్ మీడియాలో మెమె.. తీవ్రంగా మండిపడ్డ చిన్మయి శ్రీపాద!

  • సోషల్ మీడియాలో 10 ఇయర్స్ ఛాలెంజ్
  • నిక్-ప్రియాంకపై రూపొందించిన వ్యక్తులు
  • అసహ్యంగా ఉందని చెప్పిన చిన్మయి
ప్రస్తుతం సోషల్ మీడియాను ‘10 year challenge’ ఓ ఊపు ఊపేస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం తాము ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా మారాము? అన్నదాన్ని ఫొటోలు తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు సెలబ్రిటీల ఫొటోలతో మెమెలను షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోన్స్ పై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ మెమెపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా మండిపడ్డారు.
పదేళ్ల క్రితం ప్రియాంక ఓ చిన్నారిని ఎత్తుకున్నట్లు, పదేళ్ల తర్వాత పెద్దవాడైన చిన్నారినే ఆమె పెళ్లిచేసుకున్నట్లుగా కొందరు ఓ మెమెను రూపొందించారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. ‘ఈ ఫొటో ఎంత అసహ్యంగా ఉందో చూశారా? ఈ దేశంలో మగవాళ్లు తమకంటే 25 ఏళ్లు చిన్నవాళ్లు అయిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే ప్రపంచంలోని ఇతర దేశాల్లో 60 ఏళ్ల వయసు వచ్చినవాళ్లు చిన్న పిల్లలను పెళ్లి చేసుకున్నా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ, ఓ యువతి తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లిచేసుకుంటే అహస్యంగా ఇలా మెమెలు రూపొందిస్తున్నారు. క్యాజువల్‌ సెక్సిజం మంచిది కాదు’ అంటూ అని మండిపడ్డారు.
priyanka chopra
nick jones
chinmayee
sripada
Twitter
meme
10 years challenge

More Telugu News