Andhra Pradesh: విజయవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్.. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు!

  • ఆటో డ్రైవర్లపై దాడిచేసిన పాత నేరస్తుడు
  • ఈరోజు పోలీసులకు బాధితుల ఫిర్యాదు
  • సిబ్బందిని రంగంలోకి దించిన ఉన్నతాధికారులు
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఇటీవల ఓ పోలీస్ కానిస్టేబుల్ పై దాడిచేసిన ఈ గ్యాంగ్ సభ్యులు తాజాగా నిన్న రాత్రి ఇద్దరు ఆటో డ్రైవర్లపై బ్లేడ్లతో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన బాధితులు ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నిన్న తాము వస్తుండగా పాత నేరస్తుడు ఇమ్రాన్, అతని స్నేహితులు దాడిచేశారని బాధితులు పోలీసులకు తెలిపారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఈ బ్లేడ్ బ్యాచ్ వారం రోజుల క్రితం ఓ ఏఆర్ కానిస్టేబుల్ పై దాడి చేసిందని తెలిపారు. తాజాగా ఇద్దరు ఆటో డ్రైవర్లపై దాడి చేశారన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు సిబ్బందిని రంగంలోకి దించామన్నారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు.
Andhra Pradesh
Vijayawada
blade batch
attacked
2 injured

More Telugu News