USA: అమెరికాలో కాల్పుల మోత.. పిట్స్ బర్గ్ లో దోపిడీ దొంగల హల్ చల్!

  • రెండు షాపుల్లో లూటీ
  • చుట్టుముట్టిన పోలీసులు
  • కాల్పుల్లో ఒకరికి తీవ్రగాయాలు
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్ బర్గ్ లో శుక్రవారం రాత్రి (స్థానిక కాలమానం) దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇక్కడి ఈస్ట్ హిల్స్ ప్రాంతంలోని ఫ్యామిలీ డాలర్ స్టోర్ లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. వీరిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు లొంగిపోవాల్సిందిగా కోరగా, దొంగలు ఎదురుకాల్పులు ప్రారంభించారు.

ఈ ఘటనలో స్టోర్ కు సమీపంలో ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అధికారులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత ఓ షాపులో దొంగతనం చేసిన దుండగులు, మరో షాపులో దోపిడీకి యత్నిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
USA
shootout
theft
Police
pennsilvenia
robbery

More Telugu News