నేనైతే ఇక్కడ స్థిరపడాలనుకోవడం లేదు!: నగర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి
- రాజధానిలో వాయుకాలుష్యం భయపెడుతోంది
- ఇక్కడ ఉండకపోవడమే మంచిది
- వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి
తన వరకు వస్తే ఇక్కడ స్థిరపడాలనుకోవడం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో జీవించడం కష్టంతో కూడుకున్న పని అని వ్యాఖ్యానించారు. ఇక్కడి కాలుష్యం జీవించే హక్కును తీవ్రంగా దెబ్బ తీస్తోందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం ఉదయం కూడా తాను ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్టు జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.