New Delhi: నేనైతే ఇక్కడ స్థిరపడాలనుకోవడం లేదు!: నగర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి

  • రాజధానిలో వాయుకాలుష్యం భయపెడుతోంది
  • ఇక్కడ ఉండకపోవడమే మంచిది 
  • వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి

ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా తయారైందని, ఇక్కడ ఉండకపోవడమే బెటరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. తానైతే ఢిల్లీలో ఉండాలనుకోవడం లేదని పేర్కొన్నారు. రోజురోజుకు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, సాయంత్రం వేళ ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు అమలు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

తన వరకు వస్తే ఇక్కడ స్థిరపడాలనుకోవడం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో జీవించడం కష్టంతో కూడుకున్న పని అని వ్యాఖ్యానించారు. ఇక్కడి కాలుష్యం జీవించే హక్కును తీవ్రంగా దెబ్బ తీస్తోందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం ఉదయం కూడా తాను ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్టు జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.   

More Telugu News