Ilham: మొబైల్ పాస్‌వర్డ్ చెప్పలేదని.. దారుణానికి ఒడిగట్టిన భార్య

  • పాస్‌వర్డ్ చెప్పకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ
  • కోపంతో రగిలిపోయిన ఇల్హామ్
  • డేడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
మొబైల్ పాస్‌వర్డ్ ఇవ్వలేదని భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఇండోనేషియాలో జరిగింది. ఇల్హామ్ అనే మహిళ తన భర్త డేడి పూర్ణిమను మొబైల్ పాస్‌వర్డ్ అడిగింది. అతను అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. మాటామాటా పెరగడంతో కోపంతో రగిలిపోయిన ఇల్హామ్.. భర్త ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. డేడి అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డేడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇల్హామ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Ilham
Dedi Purnima
Petrol
Police
Murder

More Telugu News