Talasani: తలసానీ...టీఆర్‌ఎస్‌ తరపున ఆంధ్రాలో పోటీ చెయ్‌: తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌ సవాల్‌

  • టీడీపీలో ఉన్నత పదవులు పొందిన విషయం మర్చినట్టున్నావ్‌
  • రాజకీయ భిక్షపెట్టిన పార్టీపై విమర్శలు అనైతికం
  • మోదీ డైరెక్షన్‌లో టీఆర్‌ఎస్‌ నడుస్తోందని ఆరోపణ
తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ మాటలు కట్టబెట్టి చేతనైతే టీఆర్‌ఎస్‌ తరపున ఆంధ్రాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని తిరుపతి అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (తుడా) చైర్మన్‌ నరసింహయాదవ్‌ సవాల్‌ విసిరారు. ప్రగల్భాలు పలుకుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేతపైనా నోరుపారేసుకుంటున్న తలసాని తన సవాల్‌ స్వీకరించాలని కోరారు. టీడీపీలో చేరి ఉన్నత పదవులు పొందిన విషయాన్ని తలసాని మర్చిపోయి మాట్లాడుతుండడం అనైతికమన్నారు. మోదీ డైరెక్షన్‌లో టీఆర్‌ఎస్‌ నడుస్తోందన్నారు. జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు.
Talasani
tuda chairman

More Telugu News