nagarjuna: నాగ చైతన్యకి తాతగా నాగార్జున?

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు'
  • కథ ఓకే చేసిన నాగార్జున 
  • అన్నపూర్ణ బ్యానర్లో సినిమా  

నాగార్జున కథానాయకుడిగా ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో ఇదే పాత్రను హైలైట్ చేస్తూ .. ఈ పాత్ర పేరుతోనే ఒక సినిమా చేయాలని దర్శకుడు కల్యాణ్ కృష్ణకి నాగార్జున చెప్పి చాలాకాలమైంది. అప్పటి నుంచి కూడా కథలో మార్పులు .. చేర్పులు జరుగుతూ వస్తున్నాయి.

తాజాగా నాగార్జునకి సంతృప్తికరంగా కథ రావడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు నాగ చైతన్య కూడా నటించనున్నాడట. తాత పాత్రలో నాగార్జున .. మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నారని సమాచారం. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుందని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News