Pocharam Srinivas: ఇవాళ పేపర్లు చూశాను... అన్నీ తప్పు రాశాయి: 'పోచారం' ఇంటిపేరుపై కేసీఆర్

  • శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదు
  • ఆయన ఇంటిపేరు పరిగె
  • స్వగ్రామం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న గొప్పవ్యక్తి
  • అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదని, ఆయన ఇంటిపేరు పరిగె అని, కానీ, స్వగ్రామం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప వ్యక్తి ఆయనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. "ఈ రోజు ఉదయం పేపర్లు తిరగేస్తున్నప్పుడు 'స్పీకర్ గా పోచారం' అని అన్ని పేపర్లూ రాసినయ్ అధ్యక్షా. తమరి ఇంటిపేరు పోచారం కాదు అధ్యక్షా. తమరి ఇంటిపేరు పరిగె. కానీ, తమరు పోచారం శ్రీనివాసరెడ్డిగానే... వాస్తవానికి తమరి ఇంటి పేరు కాదది. తమరి స్వగ్రామం పేరు" అని అన్నారు. స్పీకర్ గా తమరు ఎన్నికైన సందర్భంగా పోచారం గ్రామస్థులు ధన్యులయ్యారని అన్నారు. ఆయన ప్రజా జీవితంలో పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని, వినయశీలిగా, వివాద రహితుడిగా చక్కటి సేవలందించారని, వచ్చే ఫిబ్రవరి 10తో 70వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారని అన్నారు.
Pocharam Srinivas
Telangana
Speaker
KCR

More Telugu News