KCR: మా శ్రీనివాసరెడ్డి లక్ష్మీ పుత్రుడు: పోచారంకు కేసీఆర్ ప్రశంసలు

  • తెలంగాణ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి
  • అభినందిస్తూ ప్రసంగించిన సీఎం కేసీఆర్
  • ఆయన తనకు పెద్దన్న వంటివాడని వ్యాఖ్య

తెలంగాణ అసెంబ్లీకి కొత్త స్పీకర్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి, తనకు పెద్దన్న వంటివాడని, ఆయనకు తాను లక్ష్మీ పుత్రుడని ముద్దుగా పేరు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో స్పీకర్ గా పోచారం బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయనను అభినందిస్తూ కేసీఆర్ మాట్లాడారు.

పోచారం మాదిరిగానే, తాను కూడా సింగిల్ విండో సభ్యుడిగా పనిచేసి, ఆపై ఎమ్మెల్యేను అయ్యానని గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని, ఆయన గత అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే, ఐరాస సహా, ప్రపంచమంతా గుర్తించిన 'రైతుబంధు' పథకాన్ని అమలు చేశామని అన్నారు.

రైతుబంధు పథకం ఎన్నో రాష్ట్రాల్లో స్ఫూర్తిని నింపిందని, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఇదే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఎన్నో మంచి కార్యక్రమాలను, మంచి ఫలితాలను ఆయన తెచ్చారని, ఆయన స్పీకర్ గానూ విజయవంతం అవుతారన్న నమ్మకం ఉందని అన్నారు.

More Telugu News