Telangana: కోడిగుడ్లు తినాలంటూ బండ్ల గణేశ్ ట్వీట్.. 7‘o’ క్లాక్ బ్లేడ్ ను గుర్తుచేస్తూ నెటిజన్ల ట్రోలింగ్!

  • రోజూ ఉదయం కోడిగుడ్లు తింటానన్న గణేశ్
  • అవి ఆరోగ్యానికి మంచివని వ్యాఖ్య
  • 'గణేశ్ అన్న బ్యాక్' అంటున్న అభిమానులు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తాను కోడిగుడ్లు తింటానని ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ తెలిపారు. కోడిగుడ్లు రోజూ తినాలని సూచించారు. కోడిగుడ్లు అన్నవి ఆరోగ్యానికి చాలా మంచివని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో గణేశ్ స్పందించారు.
ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు గణేశ్ ట్వీట్ పై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కొందరు గణేశ్ అన్న ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం గతంలో ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7‘o’ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటా’’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఆ కోడిగుడ్డును 7‘o’ క్లాక్ బ్లేడుతో కోసుకుని తినాలని సెటైర్లు వేస్తున్నారు.
Telangana
Andhra Pradesh
Congress
7 o clock
blade
eggs
Twitter
troll

More Telugu News