Tajmahal: ప్రేమించమంటూ 'తాజ్ మహల్' బొమ్మను విసిరితే... అమ్మాయి తండ్రి తల పగిలింది!

  • తాజ్ బొమ్మను తీసుకుని ప్రేమను అంగీకరించాలని డిమాండ్
  • బొమ్మను విసరగా తగిలి తీవ్రగాయం
  • యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమర ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ బొమ్మను తీసుకుని, తన ప్రేమను అంగీకరించాలని కోరుతూ, ఓ యువకుడు చేసిన యత్నం విఫలమై, అతన్ని కటకటాల్లోకి నెట్టింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జీతు అనే యువకుడు, కొంతకాలంగా ఓ యువతి వెంటపడుతూ, ప్రేమించాలని వేధిస్తున్నాడు. తన వద్ద ఉన్న తాజ్ మహల్ బొమ్మను తీసుకుని, ప్రేమను అంగీకరించాలని కోరుతున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల, ఆమె ఇంటి వద్దకు వచ్చిన అతను, బొమ్మను తీసుకోవాలంటూ, దాన్ని పైకి విసిరాడు. అది కాస్తా, అక్కడే కూర్చుని భోజనం చేస్తున్న ఆ యువతి తండ్రి తలకు తగిలింది. దీంతో ఆయనకు తీవ్ర గాయం కాగా, యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, జీతును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
Tajmahal
Idol
Lover
Love
Demand
Police

More Telugu News