jagan: లండన్ పర్యటనను రద్దు చేసుకున్న జగన్

  • నిన్న సాయంత్రం లండన్ వెళ్లాల్సి ఉన్న జగన్
  • పార్టీ కార్యక్రమాలతో పర్యటన రద్దు
  • నియోజక వర్గాలవారీగా సమీక్షలు నిర్వహించనున్న జగన్
కుటుంబసమేతంగా చేయాలనుకున్న లండన్ పర్యటనను వైసీసీ అధినేత జగన్ రద్దు చేసుకున్నారు. జగన్ కుమార్తె వర్ష లండన్ లో చదువుతున్నారు. ఆమెను చూసేందుకు జగన్ అక్కడకు వెళ్లాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్న రాత్రి ఆయన లండన్ పయనం కావాల్సి ఉంది.

 కానీ, పార్టీ కార్యక్రమాలతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించడంతో పాటు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. హైదరాబాదులో వివిధ నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
jagan
london
tour
cancel
ysrcp

More Telugu News