తిరుమల కొండపై భారీగా పెరిగిన రద్దీ!

  • వారాంతం కావడంతో వెల్లువలా వచ్చిన భక్తులు
  • కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపలికి క్యూలైన్
  • సర్వదర్శనానికి 22 గంటల సమయం
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వారాంతం రావడంతో స్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండి భక్తుల క్యూలైన్ బయట రెండు కిలోమీటర్ల మేరకు పెరిగింది. ఇప్పుడు క్యూలైన్లోకి ప్రవేశించేవారికి రేపు ఉదయం తరువాత మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం కల్పించగలమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోందని, క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా, శ్రీవారి టైంస్లాట్ దర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News