nithya menon: జయలలిత బయోపిక్ గురించి నిత్యామీనన్

  • జయలలితగారు అంటే నాకు ఎంతో ఇష్టం
  •  ఆమె పట్ల అభిమానం మరింత పెరిగింది
  • ఆ పాత్ర నాకు దక్కడం నా అదృష్టం  
ముఖ్యమంత్రిగా తమిళ రాజకీయాలను .. అక్కడి ప్రజలను జయలలిత ఎంతగానో ప్రభావితం చేశారు. ఆమె బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి ప్రియదర్శిని ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ది ఐరన్ లేడి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఈ బయోపిక్ కి ఈ టైటిల్ పెట్టడం పట్ల .. జయలలిత పాత్రకి నిత్యామీనన్ ను తీసుకోవడం పట్ల అమ్మ అభిమానులు సంతృప్తి చెందారు.

తాజాగా ఈ సినిమాను గురించి నిత్యా మీనన్ స్పందించింది. "జయలలితగారిపట్ల నాకు గల అభిమానం .. గౌరవమే ఆమె పాత్ర నాకు దక్కేలా చేశాయి. రాజకీయాలలో ఆమె సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కాకపోవచ్చునేమో. ఆమె జీవితాన్ని గురించిన విషయాలు తెలుసుకుంటూ వుంటే, ఆమె పట్ల నాకు గల అభిమానం .. గౌరవం మరింత పెరిగిపోతున్నాయి. జయలలిత వంటి గొప్పనాయకురాలి పాత్రను పోషిస్తుండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 
nithya menon

More Telugu News