Australia: వేసింది రెండు బంతులే.. మళ్లీ అడ్డుకున్న వర్షం

  • మూడో వన్డేకు వరుణుడి అడ్డంకి
  • మరో పది నిమిషాల్లో ఆట ప్రారంభమయ్యే చాన్స్
  • ఓవర్లు కుదించే అవకాశం

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరిదైన మూడో వన్డేకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. టాస్‌ను ఆలస్యం చేసిన వర్షం.. మ్యాచ్ ప్రారంభమై రెండు బంతులు పడ్డాక మరోమారు ఆటను అడ్డుకుంది. వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.

సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ వన్డేను భారత్-ఆసీస్ జట్లు రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మెల్‌బోర్న్ వన్డేలో గెలవడం ద్వారా సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. అయితే, కీలకమైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలుస్తుండడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో మరో పది నిమిషాల్లో ఆట ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు కామెంటేటర్లు చెబుతున్నారు. అయితే, ఓవర్లు కుదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం వన్డే సిరీస్ సమం అవుతుంది.

More Telugu News