Simran: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో సినిమాలో నాయికగా సిమ్రన్ 
  • త్వరలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం  
  • పూరీ-రామ్ సినిమాకి ముహూర్తం   
  • విజయ్ ఆంటోనికి ఇళయరాజా మ్యూజిక్
*  ఇటీవల వచ్చిన 'పేట' సినిమాలో నలభై రెండేళ్ల వయసులో కూడా గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకున్న ఒకప్పటి కథానాయిక సిమ్రన్ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. త్వరలో ప్రారంభం కాబోయే చిత్రంలో మాధవన్ సరసన ఆమె కథానాయికగా నటించనుంది.
*  హిట్ కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి కలయికలో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం.
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మాత్ శంకర్' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగును ఈ నెల 23న లాంఛనంగా ప్రారంభించి, 24 నుంచి రెగ్యులర్ షూటింగును నిర్వహిస్తారు.
*  'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోని నటించే చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తారు. స్వతహాగా సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని ఇన్నాళ్లూ తన చిత్రాలకు తానే సంగీతాన్ని సమకూర్చుకున్నారు.
Simran
Madhavan
Balakrishna
CM Ramesh
Puri Jagannadh

More Telugu News