Amit Shah: అమిత్‌షా ఆరోగ్యం మెరుగుపడుతోంది: బీజేపీ మీడియా హెడ్‌ అనిల్‌ బలూని

  • ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారు
  • మీ అందరి అభిమానానికి ధన్యవాదాలని ప్రకటన
  • స్వైన్‌ఫ్లూతో ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ చీఫ్‌
అమిత్‌ షా ఆరోగ్యం మెరుగు పడుతోందని, ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని భారతీయ జనతా పార్టీ మీడియా హెడ్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ బలూని తెలిపారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న అమిత్‌ షా  బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని షా స్వయంగా తన ట్విట్టర్‌లో తెలుపుతూ దేవుని దయ, మీ అందరి అభిమానాలతో త్వరలోనే కోలుకుంటానని ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అనిల్‌ బలూని నేడు ఓ ప్రకటన విడుదల చేస్తూ షా కోలుకుంటున్నారని, మీ అందరి అభిమానానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.
Amit Shah
aims
health condition better

More Telugu News