Chandrababu: రేపు సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • మమత ఆధ్వర్యంలో అక్కడ జరిగే ర్యాలీకి హాజరు
  • అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన ముఖ్యమంత్రి
  • జగన్‌తో కేటీఆర్‌ భేటీ అంశం ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో అక్కడ జరిగే ర్యాలీలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు హాజరుకాగా తన కోల్‌కతా ప్రయాణం, గురువారం జగన్‌తో కేటీఆర్‌ భేటీ అంశాలను వారితో చర్చించారు. మంత్రుల సూచనలు, సలహాలు తీసుకున్నారు.
Chandrababu
West Bengal
kolkatha rally

More Telugu News