RX 100: కొంచెం బరువు తగ్గాక ఆ ఫొటో పోస్ట్ చేస్తా: నెటిజన్ ప్రశ్నకు పాయల్ రాజ్ పుత్ సమాధానం!

  • 'ఆర్ఎక్స్ 100'తో యువతకు దగ్గరైన పాయల్
  • బికిని ఫోటోను కోరిన అభిమాని
  • బరువు తగ్గగానే పోస్ట్ చేస్తానని వెల్లడి

ఇటీవలి 'ఆర్ఎక్స్ 100' చిత్రంలో తన హాట్ మూమెంట్స్, లిప్ కిస్ సీన్లతో తొలి సినిమాతోనే యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా, తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ అభిమాని "మీ బికినీ ఫోటో ఉంటే పోస్ట్‌ చేయండి" అనగా, సమాధానం ఇస్తూ, తాను బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నానని, మంచి శరీరాకృతి వచ్చిన తరువాత తప్పకుండా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తానని చెప్పింది.

ఆపై మరికొందరి ప్రశ్నలకు జవాబిస్తూ, తన తల్లితో కలిసి 'ఆర్ఎక్స్ 100' సినిమా చూస్తుంటే కాస్తంత ఇబ్బందిగా అనిపించిందని, కానీ ఇదంతా నీ వృత్తిలో భాగమేనంటూ అమ్మ అండగా నిలిచిందని అంది. ఇంకా తాను 'కేజీఎఫ్' చిత్రాన్ని చూడలేదని, సమయం దొరికితే చూస్తానని అంది. తన ప్రాధాన్యత తొలుత కుటుంబానికేనని, ఆపైనే కెరీర్ అని, సాంబార్ రైస్ ను ఇష్టంగా తింటానని చెప్పింది.

More Telugu News