Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం ఎన్నిక ఇక లాంఛనమే!

  • మరికాసేపట్లో నామినేషన్ దాఖలు
  • కాంగ్రెస్ కూడా మద్దతు 
  • ఏకగ్రీవంగా ఎన్నికకానున్న పోచారం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. పోచారం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో రెండో సభాపతిగా పోచారం ఎన్నిక ఖాయమైంది. ఆయన మరికాసేపట్లో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనుండగా, ఆయన ఎన్నిక ఏకగ్రీవమే. స్పీకర్ పదవికి పోటీ పెట్టరాదని కాంగ్రెస్ నిర్ణయించుకోవడంతో పోచారం ఎన్నిక లాంఛనం కానుంది. ఈ పదవికి పార్టీ నేతలైన ఈటల రాజేందర్ వంటి వారి పేర్లను కూడా పరిశీలించినప్పటికీ, మిగతా వారెవరూ స్పీకర్ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
Telangana
Assembly
Congress
TRS
Speaker
Pocharam Srinivas

More Telugu News