East Godavari District: అశ్లీల నృత్యాల్లో గొడవ... టీడీపీ నేత అరెస్ట్!

  • తూ.గో. జిల్లాలో ఘటన
  • గెస్ట్ హౌస్ లో అమ్మాయిలతో డ్యాన్సులు
  • కేసు కాకుండా చూసేందుకు రంగంలోకి దిగిన పెద్దలు
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సమీపంలోని నడవపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఓ గెస్ట్ హౌస్ లో అశ్లీల నృత్యాలు జరుగగా, అక్కడ జరిగిన గొడవకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుడికి చెందిన ఓ గెస్ట్‌ హౌస్‌ కు ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి డ్యాన్సులు ఏర్పాటు చేయించారు.

అమ్మాయిలను కిరాయికి తెచ్చిన మధ్యవర్తికి, చూసేందుకు వచ్చిన మరో వ్యక్తికి మధ్య గొడవైంది. మద్యం సేవించి అడ్డుపడ్డాడంటూ అతడిపై దాడి జరుగగా, పోలీసులు రంగంలోకి దిగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయంలో సదరు నేతపై ఎటువంటి కేసూ నమోదు కాకుండా చూసేందుకు అధికార పార్టీ నాయకులు కొందరు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
East Godavari District
Telugudesam
Arrest
Recording Dance

More Telugu News