jagan: జగన్, కేటీఆర్ ల భేటీపై నారా లోకేష్ స్పందన

  • ముగ్గురు మోదీలు ఒక్కటయ్యారు
  • చీకటి ఒప్పందం బట్టబయలైంది
  • ఆంధ్ర ద్రోహుల ఫ్రంట్ ను జగన్ ఏర్పాటు చేశారు

వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ భేటీపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, వీరి సమావేశంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మోదీ, తెలంగాణ మోదీ, ఆంధ్ర మోదీ ఒక్కటయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఈరోజు బట్టబయలైందని అన్నారు. విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను అడ్డుకున్న కేసీఆర్ తో... ఆంధ్ర ద్రోహుల ఫ్రంట్ ను జగన్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. లంకలో పుట్టినవాళ్లు రాక్షసులని, ఆంధ్రలో పుట్టినవారు వారి వారసులంటూ కేసీఆర్ అవమానించారని గుర్తు చేశారు. ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుందని విమర్శించిన కేసీఆర్ తో జగన్ జతకట్టారని దుయ్యబట్టారు.

More Telugu News