kavitha: పోలవరంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవిత వేసిన కేసు ప్రతిని విడుదల చేసిన టీడీపీ

  • ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా పోలవరంపై కేసులు వేశారన్న దేవినేని ఉమా
  • సుప్రీంకోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి
  • పోలవరంను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ చేయని కుట్రలు లేవు

వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు భేటీ అయిన వెంటనే... టీఆర్ఎస్ పై టీడీపీ ఎదురుదాడిని మొదలు పెట్టింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవిత వేసిన కేసు ప్రతిని విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై స్టే ఇవ్వాలంటూ గతంలో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై ఏపీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధిని అడ్డుకునే విధంగా పోలవరం ప్రాజెక్టు పనులను ఆపాలంటూ సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవితతో సహా పలువురు నేతలు కేసులు వేశారని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయని తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కూడా కేసులు వేశారని చెప్పారు. ఒడిశాతో కలసి పోలవరంను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ చేయని కుట్రలు, కుతంత్రాలు లేవని విమర్శించారు. పోలవరంకు వ్యతిరేకంగా లోక్ సభ, రాజ్యసభల్లో కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారని దుయ్యబట్టారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

More Telugu News