Balakrishna: 'కథానాయకుడు' వారం రోజుల వసూళ్లు

  • సంక్రాంతి బరిలోకి దిగిన 'కథానాయకుడు'
  • ఆశించిన స్థాయిలో దక్కని వసూళ్లు 
  • 'మహానాయకుడు' తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు   

ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించిన విశేషాలతో దర్శకుడు క్రిష్ 'కథానాయకుడు' సినిమాను తెరకెక్కించాడు. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం రోజులు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో ఈ సినిమా 18.5 కోట్లను వసూలు చేసింది. భారీ అంచనాలతో సంక్రాంతి బరిలోకి ముందుగా దిగిన ఈ సినిమా, ఆశించిన స్థాయి వసూళ్లను అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగంగా 'మహానాయకుడు' కూడా చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను ఈ శనివారం నుంచి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో 'మహానాయకుడు' కొనసాగనుంది.

More Telugu News