hardhik pandya: ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా

  • మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా
  • వేటు వేసిన బీసీసీఐ
  • ఇంటికే పరిమితమైన పాండ్యా

మహిళలపై ఓ టీవీ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలకు వారు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడని ఆయన తండ్రి హిమాన్షు మీడియాకు వెల్లడించారు. ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం లేదని ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చాలా బాధగా ఉన్నాడని తెలిపారు.

హార్ధిక్ కు పతంగులు ఎగురవేయడమంటే చాలా ఇష్టమని... కొన్నేళ్లుగా క్రికెట్ కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాడని.. దాంతో పతంగులు ఎగురవేసే అవకాశం రాలేదని హిమాన్షు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. టీవీలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాడని... బీసీసీఐ సస్పెండ్ చేయడంతో బాధపడుతున్నాడని చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని చెప్పాడని తెలిపారు. బీసీసీఐ తీసుకోబోయే తదుపరి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

More Telugu News