jagan: త్వరలోనే ఏపీకి వెళ్లి జగన్ ను కేసీఆర్ కలుస్తారు: కేటీఆర్

  • జగన్ తో అన్ని విషయాలను పంచుకున్నాం
  • రానున్న రోజుల్లో చర్చలను మరింత ముందుకు తీసుకెళ్తాం
  • దేశంలో గుణాత్మక మార్పులు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు

హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ ముగిసింది. అనంతరం ఇద్దరూ కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గడచిన కొన్నేళ్లుగా దేశంలో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన వద్ద ఉంచుకుని రాష్ట్రాలను ఇబ్బందులపాలు చేస్తోందని చెప్పారు.

ఈ నేపథ్యంలో కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని తీసుకొచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదతర నేతలను కలిశారని చెప్పారు. ఆ పరంపరలో భాగంగానే ఏపీ ప్రతిపక్షనేత జగన్ కు నిన్న ఫోన్ చేసి, కలుస్తామని చెప్పామని... వారి ఆహ్వానం మేరకు ఈరోజు కలిశామని చెప్పారు.

జగన్ తో జరిగిన భేటీలో అన్ని విషయాలను పంచుకున్నామని కేటీఆర్ అన్నారు. అందరు నేతలను కలిసినట్టే... ఏపీకి వెళ్లి జగన్ ను కేసీఆర్ కలుస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో చర్చలను మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. 

More Telugu News