Sairaa: 'సైరా'లో విజయ్ సేతుపతి ఇలా... మోషన్ పోస్టర్ విడుదల!

  • రాజా పాండి పాత్రలో విజయ్ సేతుపతి
  • నేడు విజయ్ పుట్టిన రోజు
  • మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
మెగాస్టార్‌ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న భారీ చిత్రం 'సైరా'లో ప్రముఖ తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు విజయ్ సేతుపతి బర్త్ డే కాగా, చిత్రంలోని ఆయన లుక్ ఈ రోజు విడుదలైంది. రాజా పాండి అనే పాత్రలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వీరుడిలా కత్తి పట్టుకుని కనిపిస్తున్న విజయ్‌ సేతుపతి లుక్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 ఈ సినిమాను మెగా హీరో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, తమన్నా తదితర ప్రముఖ నటీనటులు ఎందరో ఇందులో నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు రామ్ చరణ్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
Sairaa
Vijay Sethupati
Motion Poster

More Telugu News