హైదరాబాద్ పాతబస్తీలో హత్య... అర్ధరాత్రి కత్తులతో పొడిచి చంపిన దుండగులు
- చార్మినార్ పరిధిలోని మామాజుమ్మా పాఠక్ ప్రాంతంలో ఘటన
- పాతకక్షలే కారణమని అనుమానం
- ఆరా తీస్తున్న పోలీసులు
పోలీసుల కథనం మేరకు...ఝాన్సీబజార్కు చెందిన రవి అలియాస్ పీటర్ రవి మరో ఇద్దరితో కలిసి శివాలయం సమీపంలో మద్యం తీసుకున్నారు. ఆ సందర్భంలో ముగ్గురి మధ్య వివాదం నెలకొంది. పరస్పరం వాదులాడుకున్నారు. ఆ వివాదం ఘర్షణకు దారితీయడంతో మిగిలిన ఇద్దరు రవిని కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.