Jagan: బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్.. కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్!: 'జగన్-కేటీఆర్' భేటీపై టీడీపీ ధ్వజం

  • ఎవరెన్ని ఫ్రంట్‌లు పెట్టినా టీడీపీని దెబ్బతీయలేరు
  • ఇన్నాళ్లకు జగన్, కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడింది
  • కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనకున్నది మోదీనే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి-టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నేడు భేటీ కానుండడంపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్ పనిచేస్తుంటే, కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ పనిచేస్తున్నారని టీడీపీ నేతలు బోండా ఉమ,  బుద్ధా వెంకన్న ఆరోపించారు.

ఏపీలో టీడీపీని దెబ్బ తీసేందుకు ఇద్దరూ కూడబలుక్కుని ముసుగు, దొంగ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరెన్ని కూటములతో వచ్చినా రానున్న ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీయలేరని, తమ పార్టీ 150 స్థానాల్లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మోదీతో కేసీఆర్, జగన్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందం ఇన్నాళ్లకు బయటపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, చంద్రబాబును దెబ్బతీసేందుకు మోదీనే కేసీఆర్‌తో ఫెడరల్ ఫ్రంట్ పెట్టించారని టీడీపీ ఆరోపించింది.

More Telugu News