kumaraswamy: ఇద్దరు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదు.. జరుగుతున్న పరిణామాలను ఎంజాయ్ చేస్తున్నా: కుమారస్వామి

  • ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుంది
  • నా బలమేంటో నాకు తెలుసు
  • నేను చాలా రిలాక్స్ గా ఉన్నా
కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు హెచ్.నగేష్, ఆర్.శంకర్ లు మద్దతును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టిందనే ప్రచారం నేపథ్యంలో, ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.

దీనిపై ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ఇద్దరు పోయినంత మాత్రాన భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరి మద్దతు పోయినంతం మాత్రాన మ్యాజిక్ ఫిగర్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. తాను చాలా రిలాక్స్ గా ఉన్నానని చెప్పారు. తన బలమేంటో తనకు తెలుసని అన్నారు. గత వారం రోజులుగా మీడియాలో వస్తున్నదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు.  
kumaraswamy
Karnataka
independents
resign

More Telugu News