sharmila: షర్మిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

  • దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు
  • అదనపు డీసీపీ నేతృత్యంలో దర్యాప్తు ప్రారంభం
  • ఈ దుష్ప్రచారాన్ని ఖండించిన వైసీపీ నేతలు
హీరో ప్రభాస్ కు, తనకు సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై హైదరాబాద్ పోలీసులకు వైసీపీ నాయకురాలు షర్మిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ నేతృత్యంలో ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. కాగా, వైఎస్ షర్మిళపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండించారు. ఇది కేవలం షర్మిళపై జరిగిన విషప్రచారం మాత్రమే కాదని, మొత్తం మహిళలపై జరిగిన దాడి అని అభివర్ణించారు.
sharmila
prabhas
cyber crime police
Jagan

More Telugu News