YSRCP: షర్మిళపై పోస్టింగ్స్ పెట్టమని ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయాలి: వాసిరెడ్డి పద్మ డిమాండ్

  • నాలుగు నెలలుగా ఈ దుష్ప్రచారం ఊపందుకుంది
  • ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలి
  • టీడీపీ దుష్ప్రచారం తగదు
వైఎస్ షర్మిళపై దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్స్ పెట్టిన వారిని కాకుండా, వారిని పెట్టమని ఎవరైతే ప్రోత్సహించారో వారిని వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో కూడా షర్మిళ ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకోవడంతో కొంత ప్రచారం ఆగింది కానీ, జగన్ పాదయాత్రకు ఎప్పుడైతే ఆదరణ పెరిగిందో అప్పటి నుంచి మళ్లీ ఈ దుష్ప్రచారం మొదలైందని అన్నారు. నాలుగు నెలల నుంచి ఈ దుష్ప్రచారం ఊపందుకుందని, ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారన్న విషయమై విచారణ చేసి నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా వైపీపీ పైనా, వైఎస్ కుటుంబసభ్యులపైనా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఒకరి క్యారెక్టర్ పై బురదజల్లేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
YSRCP
Jagan
vasireddy
padma

More Telugu News