sharmila: ఆంధ్రా పోలీసులపై నమ్మకంలేదు: వైయస్ షర్మిళ

  • ప్రభాస్ తో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది
  • ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే... తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు చేశా

ప్రముఖ సినీ హీరో ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని... దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని మీడియాతో మాట్లాడుతూ ఆమె ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రచారం జరిగిందని... అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంతో... పుకార్లు కొంతకాలం ఆగిపోయాయని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

  • Loading...

More Telugu News