sandeep kishan: నేరుగా తెలుగు సినిమా చేయనున్న వరలక్ష్మీ శరత్ కుమార్

  • నాగేశ్వర రెడ్డి నుంచి మరో కామెడీ మూవీ
  • టైటిల్ గా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'
  • సందీప్ కిషన్ జోడీగా హన్సిక    
తమిళ తెరకి కథానాయికగా పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్, ఆ తరువాత కీలకమైన పాత్రలను సైతం చేస్తోంది. విభిన్నమైన పాత్రలను చేయడానికే తాను ఆసక్తిని చూపుతానని చెబుతోన్న వరలక్ష్మీ శరత్ కుమార్, ఇటీవల కాలంలో చేసిన పాత్రలకి గాను మంచి క్రేజ్ తెచ్చుకుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలు తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేయడమే కాకుండా, మంచిపేరు తెచ్చిపెట్టాయి.

తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్న ఆమె, త్వరలో తెలుగులో నేరుగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. హన్సిక కథానాయికగా చేయనున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన రోల్ కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే
sandeep kishan
hansika

More Telugu News