Prabhas: నేను దోషిలా నిలబడి, నా వాదన వినిపించుకోవాలా?: వైఎస్ షర్మిళ భావోద్వేగం

  • ప్రభాస్ కు, షర్మిళకు సంబంధముందని ప్రచారం
  • ఇది అందరు మహిళల దుస్థితన్న షర్మిళ
  • కఠిన చర్యలు తీసుకోవాలని అంజనీ కుమార్ కు వినతి
తనకు, హీరో ప్రభాస్ కు వివాహేతర సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఒక వర్గం చేస్తున్న ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన భర్త అనిల్ కుమార్ తో కలిసి వచ్చి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్ సోదరి షర్మిళ, ఆపై మీడియాతో మాట్లాడుతూ, భావోద్వేగానికి గురయ్యారు.

"తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు కాకుండా, తప్పుడు ప్రచారాలు చేయిస్తున్న వారు కాకుండా, ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి, నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం నాకే కాదు. మహిళలందరికీ ఇది అవమానకరం. ఇది ఐదేళ్ల కింద ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మళ్లీ మళ్లీ కూడా తలెత్తవచ్చు. ఇది నేను మాట్లాడకపోతే, ఇదే నిజమని కొంతమందైనా అనుకునే ప్రమాదముంది. కనుక, ఈ తరహా తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించడానికి, ఈ రోజు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడమే కాకుండా, మీడియా ముందుకు రావడం జరిగింది" అని భావోద్వేగానికి గురయ్యారు.
Prabhas
Sharmila
Jagan
Anjani Kumar
Hyderabad
CP

More Telugu News