guntur: గుంటూరులో వినూత్న నిరసన.. భోగి మంటల్లో మోదీ దిష్టిబొమ్మ దహనం.. వీడియో ఇదిగో!

  • మోది దిష్టిబొమ్మ, ఫొటోలను దహనం చేసిన తెలుగు యువత
  • ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ మండిపాటు
  • ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్
ప్రధాని మోదీపై ఉన్న వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భోగి పండుగ రోజున కూడా వ్యక్తపరిచారు. భోగి మంటలతో కేంద్ర ప్రభుత్వంపై నిరసనను వ్యక్తం చేశారు. గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. భోగి మంటలతో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ, చిత్ర పటాలను వేసి దహనం చేశారు.

ఈ సందర్భంగా మోదీకి వ్యతిరేకంగా ప్లకార్డులను చేతబట్టి, నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువ నేతలు మాట్లాడుతూ, ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురంహంకారి అయిన మోదీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
guntur
telugu yuvatha
bhogi mantalu
Narendra Modi

More Telugu News